అమెరికాలో కాల్పులు అసలేం జరిగిందంటే...?   Chicago Hospital Firing In America     2018-11-21   16:03:01  IST  Surya

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భాద్యతారాహిత్య విధానాలకి మరో సారి బదులు చెప్పుకునే పరిస్థితి ట్రంప్ కి ఏర్పడింది.రోజు రోజుకి అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చల్ అక్కడి పౌరులలో ఆందోళన కలుగ చేస్తున్నాయి.

సరిగ్గా రెండు రోజుల క్రితం ఒక భారతీయుడి పై 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ఆయన చనిపోయిన ఘటన మరువక ముందే..ఇప్పుడు అమెరికాలోని చికాగోలో ఈ కాలుల ఘటన జరగడం ఎంతో దారుణమైన విషయమని అంటున్నారు..వివరాలలోకి వెళ్తే..

అమెరికాలోని చికాగో ఆస్పత్రిలో జరిగిన కాల్పులలో నలుగురు మృతిచెందారు. అందులో ఆస్పత్రికి చెందిన ఇద్దరు మహిళా సిబ్బందితోపాటు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కూడా ఉన్నారు. ఫైరింగ్‌ జరిపిన గన్‌మెన్‌ కూడా ఈ ఘనటలో ప్రాణాలు కోల్పోయాడు..షూటౌట్‌లో పాల్గొన్న మరో ఆఫీసర్‌ మాత్రం గాయాలతో బయపడ్డాడు. తనతో సంబంధం ఉన్న ఓ మహిళను సాయుధుడు టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Chicago Hospital Firing In America-Telugu NRI News Updates

ఈ సంఘటన చికాగోలోని మెర్సీ ఆస్పత్రిలోని కార్‌ పార్క్‌ ఏరియాలో జరిగింది. కాగా ఆసుపత్రిలో మొత్తం 20 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన కాల్పుల ఘటనతో సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు…అయితే రోగులు అందరూ సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.