అమెరికాలో పేలిన గన్..13 మంది మృతి..!   Another Fire At Borderline Bar In America     2018-11-09   13:25:01  IST  Surya

అమెరికాలో దుండగులు మరోసారి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు..అమెరికాలో గన్ కల్చర్ కారణంగా ఇలాంటి మారణహోమాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నా సరే పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. గతంలో కూడా ఇలాంటి సంఘంటనలు జరిగినప్పుడు అక్కడే ఉన్న భారతీయుడు ఒకరు చనిపోయిన సందర్భం కూడా ఉంది..అయితే ఎన్ని సార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా సరే ట్రంప్ ప్రభుత్వం వాటిని నిలువరించడంలో విఫలం అవుతూనే ఉంది.

తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణంలో ఉన్న బార్డర్‌లైన్‌ బార్‌లో జరిగిన ఈ సంఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు కూడా అయ్యాయి…వివరాలలోకి వెళ్తే..థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణానికి చెందిన ఓ కళాశాల చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. ఆ కళాశాలకు పక్కనే ఉన్న బార్‌లో నుంచిపేలుళ్ల శబ్దం వినిపించడంతో హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.

Another Fire At Borderline Bar In America-

కాల్పులు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేసుకుని ఆ దుండగుడిని కాల్చి చంపేశారు. అసలు ఎందుకు దుండగుడు కాల్పులకి తెగబడ్డాడు అనే కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు…గత నెల ఒక యూదుల ప్రార్ధనా మందిరంలోకి ఒక దుండగుడు కాల్పులు జరిగిన ఘటన మరువక ముందే మరో సంఘటన జరగడం ఎంతో దారుణమని ప్రజా సంఘాలు వాపోతున్నారు.