ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా దేశం మొత్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2( Pushpa 2 ) అనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ను చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా దాదాపు 500 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా రిలీజ్ కి ముందే తము పెట్టిన పెట్టుబడిని రాబట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రాఫిట్ గానే తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని సుకుమార్ గానీ అల్లు అర్జున్ ( Allu Arjun )గాని ఏ మేరకు సక్సెస్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి వీళ్ల కాంబో సక్సెస్ ఫుల్ కాంబో గా నిరూపించుకోవాలని వీళ్లిద్దరూ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కనక మనం చూసినట్లయితే ఈ టీజర్ లో అల్లు అర్జున్ గంగాలమ్మ జాతరలో మంగళం శ్రీను( Mangalam Srinu ) గెటప్ లో కనిపించాడు.అయితే ఈ గెటప్ లో ఉన్నప్పుడు ఆయన మంగళం శ్రీను ను చంపేయబోతున్నట్టుగా కూడా క్లారిటీ అయితే వస్తుంది.

మంగళం శ్రీను మనుషుల్ని చంపి డైరెక్టుగా ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని కూడా చంపేయబోతున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి… మరి ఈ సినిమాతో నువ్వు ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది తెలియాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే….








