సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటనలో పోలీసు అధికారులపై వేటు..!!

ఏప్రిల్ 13వ తారీకు వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పై విజయవాడలో బస్సు యాత్రలో రాయి దాడి జరగడం తెలిసిందే.ఈ ఘటన ఏపీ రాజకీయాలలో( AP politics ) సంచలనం సృష్టించింది.

 Attack On Police Officers In The Incident Of Stone Pelting On Cm Jagan , Ap Cm J-TeluguStop.com

సరిగ్గా జగన్ ఎడమ కనుబొమ్మపై రాయి బలంగా తాకటంతో రక్తం కూడా రావడం జరిగింది.దీంతో వెంటనే బస్సు పై నుండి లోపలికి వెళ్లి.

ప్రథమ చికిత్స చేయించుకుని ఆరోజు యాత్ర ముగించారు.అనంతరం వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో.

వైద్యం చేయించుకోవడం జరిగింది.ఈ ఘటనలో ఇప్పటికే రాయి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని.

విచారణ చేయడం జరిగింది.ఆ వ్యక్తి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు.

పరిస్థితి ఇలా ఉండగా సీఎం జగన్ పై రాళ్లదాడి నేపథ్యంలో ఈసీ స్పందించింది.ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది.విజయవాడ సీపీ కాంతి రానా( CP Kanti Rana ) టాటా, ఇంటలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది.తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది.

వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది.ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేసింది.ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ఉందని వివరస్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube