ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో కల్కి( Kalki ) అనే సినిమా వస్తుంది.అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానిమీద క్లారిటీ అయితే రానప్పటికీ తొందర్లోనే సినిమా రిలీజ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక బాహుబలి సినిమా తర్వాత మూడు ఫ్లాపులు వచ్చాయి.
ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.అయినప్పటికీ కల్కి సినిమాతో సక్సెస్ లా పరంపర కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది.అందుకే ప్రభాస్ ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా అమితాబచ్చన్( Amita Bachchan ) పోషిస్తున్న అశ్వద్ధామ క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్ అనేది రిలీజ్ చేశారు.అయితే ఈ పోస్టర్ ను చూనట్లయితే అమితాబచ్చన్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఇక తను పోషిస్తున్న అశ్వద్ధామ క్యారెక్టర్ కల్కి కి హెల్ప్ చేసే క్యారెక్టరా లేకపోతే తను కూడా విలన్ గా మారి కల్కి మీద దాడి చేయబోతున్నాడా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది.
ఇక అశ్వద్ధామ కుళ్ళిన శరీరంతో ఉంటాడు కాబట్టి తనను ఎవరు తాకకూడదనే నియమం కూడా ఉంటుంది.కాబట్టి ఈ సినిమాలో దర్శకుడు అసలు ఎలా అమితాబచ్చన్ క్యారెక్టర్ మలిచాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో కనక ప్రభాస్ సక్సెస్ కొడితే వరుసగా రెండు సినిమాలతో పాన్ ఇండియా లో సూపర్ హిట్స్ ని కొట్టిన తెలుగు స్టార్ హీరోగా కూడా గుర్తింపు పొందుతాడు.