భర్తతో కలిసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క.. ఆ నాయకుడికి పోటీగా?

బర్రెలక్క ( Barelakka ) పరిచయం అవసరం లేని పేరు ఒక నిరుద్యోగుగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈమె అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చి సంచలనంగా మారారు.తెలంగాణలో గత సభ్యులు ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వార్తలలో నిలిచారు.

 Barelakka Alias Shirisha Mp Nomination Photos Goes Viral Barelakka, Shirisha, Mp-TeluguStop.com

కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా దూసుకెళ్లారామె.అయితే ఎన్నికల్లో బర్రెలక్కకు కేవలం 5, 754 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు.

ఇలా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలు అయినప్పటికీ ఈమె మాత్రం నిరాశ చెందకుండా తిరిగి ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికలలో కూడా పోటీ చేయబోతున్నట్లు గతంలో వెల్లడించారు.అయితే తాజాగా లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడం కోసం ఈమె నామినేషన్ వేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.మంగళవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్( Nagar Kurnool Parliament ) స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష.

ఎలాంటి హడావుడి, లేకుండా.కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఇదే పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

ఇలా బలమైన నాయకుడికి పోటీ ఇస్తూ ఈమె ఎన్నికల బరిలోకి దిగారు.ఇటీవల వెంకటేష్ ( Venkatesh ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినటువంటి బర్రెలక్క ఏకంగా తన భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేయడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరి ఈసారైనా ఈమె విజయం అందుకుంటారా లేదా అన్న ఆసక్తి మరోసారి అందరిలోనూ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube