జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్న సంగతి మనకు తెలిసినదే.ఈయన పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ నామినేషన్( Pawan Kalyan Nomination ) కూడా దాఖలు చేశారు.అయితే నామినేషన్ లో భాగంగా ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి అఫీడవిట్ లో తన ఆస్తులు వివరాలను అప్పులను కూడా తెలియజేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ( Surekha ) వద్ద కూడా అప్పు చేసినట్లు ఇందులో పేర్కొన్నారు.అలాగే తన ఆస్తులు చిట్టా మొత్తం ఇందులో పొందుపరిచారు.గత ఐదు సంవత్సరాల కాలంలో ఈయన 114 కోట్ల రూపాయల ఆదాయం పొందినట్లు తెలియజేశారు.ఇక ఈయన పేరు మీద అప్పులు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తుంది.
లోన్లతో కలిపి ఏకంగా 64 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లు తెలిపారు.ఈ 64 కోట్లలో పవన్ కళ్యాణ్ కొంతమంది వ్యక్తుల వద్ద అప్పు చేసినట్టు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తల్లిగా ఆరాధించే సురేఖ వద్ద కూడా ఈయన రెండు కోట్ల అప్పు చేసినట్లు తెలిపారు.సురేఖ వద్ద మాత్రమే కాకుండా హారిక అండ్ హాసిని నిర్మాణ సమస్తకి ఆరు కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు.నిర్మాత నవీన్ యర్నేని, మైత్రి మూవీ మేకర్స్ కి కలిపి పవన్ 8 కోట్లకి పైగా అప్పు ఉన్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి కూడా పవన్ కళ్యాణ్ 10 లక్షలు అప్పు ఉన్నట్లు తెలిపారు.
అదే విధంగా పవన్ కళ్యాణ్ ట్యాక్సుల రూపంలో 70 కోట్ల వరకు చెల్లించినట్లు పేర్కొన్నారు.ఈ విధంగా ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ పొందుపరిచిన ఈ అప్పుల చిట్టా చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.