చర్మ సంరక్షణలో టమోటా ఎంత సహాయపడుతుందో తెలుసా

టమోటా ఆరోగ్యానికే కాదు చర్మ సరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది.టమోటాలో చర్మానికి సంబంధించి అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

 Amazing Benefits Of Tomatoes For Skin Care Details, Tomato, Tomato Health Benefi-TeluguStop.com

ఆల్ఫా-బీటా కెరోటిన్, లుయూటిన్ మరియు లైకోపీన్ వంటి ప్రధాన కేరోటినాయిడ్స్ ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడుతుంది.టమోటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన UV-A ఎక్స్పోజర్ల నుంచి చర్మంకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.

టమోటా మీ ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ని సులభంగా తొలగిస్తుంది.బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో టమోటా ముక్కతో రుద్ది పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్ సమస్య త్వరగా తగ్గిపోతుంది.ఎండలో తిరగటం వలన ముఖం కాస్త నల్లగా, మురికిగా మారుతుంది.

ఈ సమస్య నుండి బయట పడాలంటే ముఖానికి టమోటా గుజ్జు రాసి పావుగంట తర్వాత సారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా ఎండలోకి వెళ్లి వచ్చిన ప్రతిసారి చేస్తూ ఉంటే ముఖం మీద సన్ తాన్ ఉండదు.ముఖం మురికి లేకుండా కాంతివంతంగా ఉంటుంది.టమోటా మొటిమలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

టమోటాలో ఉండే మిటమిన్ ఏ, సి, కె మరియు ఆమ్లధర్మ లక్షణాలు మీ ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి.ముఖానికి టమోటా గుజ్జు రాసి పావుగంట తర్వాత సారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube