ఏంటి ఈ ట్విస్ట్ :  ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ' రామసహాయం రఘురాంరెడ్డి 

తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ , ఖమ్మం అభ్యర్థి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించింది.కాంగ్రెస్ కు ఇక్కడ గట్టిపట్టు ఉండడం తో ఖమ్మం( Khammam) సీటు పై చాలామంది నేతలే ఆశలు పెట్టుకున్నారు.

 What A Twist : Khammam Congress Candidate 'ramasahayam Raghuram Reddy, Ramsahay-TeluguStop.com

పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ప్రస్తుత మంత్రుల కుటుంబ సభ్యులు కోసం గట్టిగానే లాబీయింగ్ చేసినా,  ఎవరికి అవకాశం దక్కలేదు .ఊహించని వ్యక్తికి ఖమ్మం ఎంపీ సీటును ఖరారు చేశారు.ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇక్కడ టికెట్ కేటాయిస్తూ వచ్చినా.  ఇప్పుడు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఏ సీటును కేటాయించడం చర్చనీయాంశం గా మారింది.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.దీంతో ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తప్పకుండా గెలుస్తారని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది.

అందుకే సాంప్రదాయానికి భిన్నంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసింది.

Telugu Aicc, Khammam Mp Seat, Revanth Reddy, Srinivas Reddy-Politics

 గత కొద్దిరోజులుగా ఈ టిక్కెట్ ను ఎవరికి కేటాయిస్తారు అనే ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలో అనేక పేర్లు పరిశీలనకు వచ్చాయి.కానీ చివరకు రామ సహాయం రఘురామిరెడ్డి పేరును అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించింది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు , నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.కానీ చివరి నిమిషంలో రామ సహాయం రఘురామిరెడ్డి పేరు ఫైనల్ అయింది .స్థానికుడైన రఘురాం రెడ్డికి టికెట్ దక్కుతుందని ముందుగా ఎవరు అంచనా వేయలేకపోయారు.అయితే ఈయన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) వియ్యంకుడు కావడంతో  శ్రీనివాస్ రెడ్డి అధిష్టానం పెద్దల వద్ద గట్టిగా లాభియింగ్ చేశారనే విషయం అర్థమవుతుంది.

Telugu Aicc, Khammam Mp Seat, Revanth Reddy, Srinivas Reddy-Politics

 మంగళవారం రోజునే రామ సహాయం రఘురాం రెడ్డి ( Ramsahayam Raghuram Reddy, )తరఫున రెండు సెట్ల నామినేషన్ల ను ఆ పార్టీ నేతలు దాఖలు చేయడం గమనార్హం.ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్నా .రెడ్డి సామాజిక వర్గానికి ఈ సీటు ను కేటాయించడాన్ని మిగతా కాంగ్రెస్ నేతలు ఎవరూ ముందుగా ఊహించలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube