సాధారణంగా పోలీసుల ఉద్యోగం అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది.ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో ఊహించడం కూడా కష్టాన్ని కాబట్టి ఈ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
ఇక ట్రాఫిక్ పోలీసులైతే వేగంగా వచ్చే వాహనాల నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది.కొంతమంది ఆపమంటే ఆపకుండా పోలీసులు ఢీకొట్టి వెళ్లడానికి ట్రై చేస్తుంటారు.
వారు మధ్య మధ్యలో ఉండొచ్చు లేదంటే భయమేసి వారిని ఢీ కొట్టి పారిపోదామని అనుకుంటూ ఉండవచ్చు.తాజాగా ఈ కోవకు చెందిన ఒక మహిళ పాకిస్థాన్ పోలీసు( Pakistan Police)లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.
ఆ మహిళ వేగంగా వెళ్తున్నందున ఇస్లామాబాద్( Islamabad)లో మోటార్వే పోలీసులు ఆమెను ఆపారు.ఆమె నిరాశ చెంది రోడ్డుపైనే అధికారులతో వాగ్వాదం చేసింది.తర్వాత పోలీసులకు షాకిస్తూ ఆమె తన కారును ఒక అధికారిని స్వల్పంగా తొక్కిస్తూ వెళ్లిపోయింది, టోల్ ప్లాజా( Toll Plaza) బారియర్ను ఛేదించి పారిపోయింది.అదృష్టవశాత్తూ, ఒక పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను వెంబడించింది.
ఈ దృశ్యాలను వైరల్ వీడియోలో మీరు చూడవచ్చు.
కొంతమంది మహిళపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు.మరికొందరు ఆమె అహంకారాన్ని విమర్శించారు.ఈ ఘటన నెటిజన్లలో ఆగ్రహానికి దారితీసింది, వారు కఠినమైన శిక్షలను విధించాలని డిమాండ్లు చేశారు.
అధికారులు మహిళ వేగంగా వెళ్లిన నేరాన్ని ధృవీకరించారు.ఈ ఘటన రోడ్లపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతుంది.
ఇక ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.కొందరు వాహనదారులు చేసిన పని వల్ల పోలీసు అధికారులు కారు ముందు భాగాల్లో వేలాడుతూ ప్రమాదకర స్థితిలో కనిపించారు.
అదృష్టవశాత్తు వారు ఆ ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.