ఇటీవల వార్సా నుంచి క్రాకోవ్( Kraków)కు వెళ్లే విమానంలో ఒక అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది.విమానం బయలుదేరే సమయంలో, పైలట్ కెప్టెన్ కొన్రాడ్ హాన్క్ తన ప్రియురాలికి హార్ట్ టచింగ్ మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు.
విమానంలో ఎయిర్‌హోస్టెస్‌గా ఆమె పని చేస్తోంది.దాంతో విమానంలోనే పెళ్లి చేసుకోవాలని కోరుతూ ప్రతిపాదించాడు.
ఈ రొమాంటిక్ ఘటనను వీడియోలో చిత్రీకరించారు.ఇది ఆన్‌లైన్‌లో వైరల్ అయింది, చాలా మందిని ఫిదా చేసింది.
ఈ ఎయిర్‌లైన్, LOT పోలిష్ ఎయిర్‌లైన్స్, ఈ వీడియోను తమ ఫేస్‌బుక్ పేజీలో పంచుకుంది.వీడియోలో, కెప్టెన్ హాన్క్ కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చి ప్రయాణీకులతో మాట్లాడటానికి పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్‌ను ఉపయోగించాడు.సుమారు 1.5 సంవత్సరాల క్రితం తన ఉద్యోగం ద్వారా తాను ఎలా ఆమెను కలుసుకున్నాడో చెబుతూ, ఆమె తన జీవితంలో ఎంత ప్రభావం చూపిందో వివరిస్తూ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు.

ఆమె తన ప్రేయసి అని, తాను ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పినప్పుడు, ఆమె విమానం వెనక భాగంలో నుంచి నడుచుకుంటూ వచ్చి అతనిని కౌగిలించుకుంది.ప్రయాణీకులు ఈ జంటకు హర్షించారు, వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఫ్లవర్ బొకేను పట్టుకుని కెప్టెన్ హాన్క్( Captain Konrad Hanc ) తన ప్రియురాలిని పెళ్లి చేసుకోమని అడిగాడు.పాల్( Paul) అనే ఎయిర్‌హోస్టెస్ పరుగున వచ్చి అతన్ని గట్టిగా వాటేసుకుంది.
ఆమె అతని ప్రతిపాదనకు అంగీకరించింది.అతను ఉంగరాన్ని ఆమె వేలుకు తొడిగాడు.
దానితో విమానంలోని ప్రయాణీకులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.

ఈ జంట మొదట కలుసుకున్న క్రాకోవ్‌కు వెళ్లే విమానంలోనే ఈ ప్రపోజల్ జరిగిందని ఎయిర్‌లైన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంటూ వారి సంతోషకరమైన క్షణాలను పంచుకుంది.ఈ పోస్ట్ 2 లక్షలకు పైగా వ్యూస్, 16,000 లైక్స్ వచ్చాయి.ఫేస్‌బుక్ యూజర్లు చాలా మంది ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించి, తమ ఆనందాన్ని, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓ వినియోగదారు ఇంత అందమైన కథనాన్ని పంచుకున్నందుకు ఎయిర్‌లైన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.మరొకరు పెళ్లి జీవితాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి మార్గమని పొగిడారు.ఈ జంటకు సురక్షిత ప్రయాణాలను, ప్రేమ, ఆనందం నిండిన సంతోషకరమైన జీవితం కలగాలని కోరుకున్నారు.ఈ లింక్ https://www.facebook.com/share/v/Gfo8Qc8pxotMk5uY/?mibextid=9rXMBq పై క్లిక్ చేయడం ద్వారా వీడియోను చూడవచ్చు.