మానసిక రోగిపై ఉడుకు నీళ్లు పోసిన మలేషియన్ మహిళ.. ఊహించని శిక్షతో లబోదిబో..??

మలేషియా( Malaysia )లో ఒక అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.ఓ సా కీ అనే ఒక మహిళ డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తిపై వేడి నీరు పోసి తన కఠిన హృదయాన్ని చాటుకుంది.

 Malaysia Jails Woman Who Threw Scalding Hot Water On Downs Syndrome Man,malaysia-TeluguStop.com

ఈ పని చేసినందుకు ఆమెకు ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.ఈ ఘోరమైన సంఘటన బయన్ లెపాస్, పెనాంగ్ రాష్ట్రంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనంలోని లిఫ్ట్‌లో జరిగింది.

ఏప్రిల్ 19న ఉదయం 9:24 ప్రాంతంలో చోటు చేసుకుంది.ఓ సా కీ( Oo Saw Kee ) 33 ఏళ్ల వ్యక్తి అయిన ఎ.సోలారాజ్‌పై ఉద్దేశపూర్వకంగా ఉడుకు నీళ్లు( Hot water ) పోసింది.దాంతో బాధితుడికి తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయి.

ఆ వ్యక్తి ఆ గాయాలు తాళలేక అల్లాడిపోయాడు.ఓ సా కీ నేరాన్ని ఒప్పుకుని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ద్వారా దోషిగా తీర్పొందారు.10 ఏళ్ల జైలు శిక్షతో పాటు, ఆమెకు 6,000 రింగ్గిట్ (సుమారు రూ.1 లక్ష) జరిమానా విధించింది.

న్యాయమూర్తి అహ్జల్ ఫరిజ్ అహ్మద్( Sessions Court Judge Ahzal Fariz Ahmad Khairuddin ) ఖైరుద్దీన్ ఓ సా కీ చర్యలను తీవ్రమైనవి, క్రూరమైనవి మరియు అమానవీయమైనవిగా అభివర్ణించారు.బాధితుడు ఏ తప్పు చేయలేదని ఆ మహిళను ఏ మాత్రం బాధ పెట్టలేదని ఆయన నొక్కి చెప్పారు.న్యాయమూర్తి ఓ సా కీ వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాన్ని ముందు ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది.బాధితుడి పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉంది.

ఎ.సోలారాజ్‌ను చికిత్స కోసం పెనాంగ్ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు వేడి నీరు అతని కుడి భాగాన్ని ముందు నుంచి వెనుక వరకు తీవ్రంగా గాయపరిచిందని నిర్ధారించారు.అదృష్టవశాత్తూ, అతడికి ప్రాణాపాయం తప్పింది.

20 సెకన్ల ఘటన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అయింది, ఓ సా కీ ప్రవర్తనను విస్తృతంగా ఖండించారు.ఓ సా కీకి న్యాయవాది ఎడ్రిక్ లో ఉచితంగా న్యాయవాద సేవలందించారు, ప్రాసిక్యూషన్‌ను డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొహ్ద్ నోరిన్ ఇస్మాయిల్ నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube