మేమంతా సిద్ధం( Memantha Siddham) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన జగన్( CM ys jagan ) వైసీపీని ప్రజలకి తీసుకెళ్లడంలో మరింత సక్సెస్ అయ్యారు.22 రోజుల పాటు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించారు.తన యాత్రలో జనాల నుంచి విశేష స్పందన వచ్చే విధంగా జగన్ తన ప్రసంగాలు ఉండేలా చూసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతూ , వారి సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏ స్థాయిలో లబ్ధి చేకూరింది, రాబోయే రోజుల్లో ప్రజలకు మరెన్ని ప్రయోజనాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా వివరించడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
ఒకపక్క అభివృద్ధి , సంక్షేమం గురించి వివరిస్తూనే, తమ రాజకీయ ప్రత్యర్థులైన టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ను టార్గెట్ చేసుకుని జగన్ విమర్శలు చేయడం, అవి జనాల్లో చర్చనీయాంశం గా మారడం ఇలా చెప్పుకుంటూ వెళిత మేమంతా సిద్ధం సభ వైసిపి ఊహించిన దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయిందనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది.
మొత్తం 22 రోజుల పాటు 2200 కిలోమీటర్లు , 86 అసెంబ్లీ, 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర ద్వారా పర్యటించారు.గత నెల 27 న ప్రారంభమైన ఈ యాత్ర సక్సెస్ కావడంతో వైసిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఇక ఈరోజు కడప జిల్లా పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేసిన తరువాత తన ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లబోతున్నారు.
శుక్రవారం మేనిఫెస్టో( Manifesto) ప్రకటించిన తరువాత వచ్చే 17 రోజుల్లో 50 నుంచి 70 సభల వరకు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ సభల ద్వారా ప్రజల్లో వైసిపి పై మరింత ఆదరణ పెంచే విధంగా తన ప్రసంగాలు ఉండేలా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అదే సమయంలో తమను ఓడించేందుకు ఏకమైన టిడిపి , జనసేన బిజెపిల తీరును ఎండగట్టే విధంగా జగన్ ప్రసంగాలు ఉండబోతున్నాయట.