రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ 

సార్వత్రిక ఎన్నికలకు( general elections ) సంబంధించి తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించి నామినేషన్ల ను దాఖలు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది.దీంతో ఈరోజు , రేపు భారీ ఎత్తున నామినేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.

 The Process Of Nominations Will End Tomorrow, Nominations, Ap Elections, Ysrcp,-TeluguStop.com

ఇప్పటికే భారీగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.నాలుగో దశలో తెలంగాణ లో 17 పార్లమెంట్ స్థానాలకు ఏపీలో 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి .ఏపీ,  తెలంగాణతో పాటు , బీహార్ , జార్ఖండ్ , మధ్యప్రదేశ్,  మహారాష్ట్ర , ఒరిస్సా , యూపీ, బెంగాల్ , జమ్మూ కాశ్మీర్ లోని మొత్తం 96 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగబోతోంది.దీంతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

Telugu Ap, Congress, Telangana, Ysrcp-Politics

ఇప్పటికే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు సంబంధించి నిన్నటి వరకు మొత్తం 415 నామినేషన్ దాఖలు అయ్యాయి .ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు( 25 parliamentary constituencies ) 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి.అలాగే ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,350 నామినేషన్ దాఖలు అయ్యాయి .నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 18 విడుదల అవ్వగా,  వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.  ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ రేపటితో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుంది.ఈనెల 26న నామినేషన్లను పరిశీలిస్తారు .

Telugu Ap, Congress, Telangana, Ysrcp-Politics

నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ గడువు ఉంది .ఇక మే 13న ఎన్నికల పోలింగ్ జరుగుతుంది .జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.ఇప్పటికే ఏపి , తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం పై దృష్టి సారించాయి.

ఇలా ఆయా పార్టీల అధినేతలు , పార్టీ కీలక నాయకులు నిత్యం జనాల్లోనే ఉంటూ ప్రజా బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.తమను , తమ పార్టీని గెలిపించాల్సిందిగా జనాలను కోరుతూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube