పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న బిజెపి.. సిద్దిపేటలో అమిత్ షా బహిరంగ సభ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభావం చూపించలేకపోయినా,  పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) మాత్రం సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బిజెపి అగ్ర నేతలు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

 Bjp Is Planning Well.. Amit Shah's Public Meeting In Siddipet, Telangana Bjp, Ce-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభావం బాగా తగ్గడంతో , కాంగ్రెస్ , బిజెపిల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని బిజెపి అగ్ర నేతలు అంచనా వేస్తున్నారు.అందుకే తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

ఈ మేరకు రేపు గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు.రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా( Amit Shah ) పాల్గొని ప్రసంగించనున్నారు.

మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

Telugu Amith Sha, Central, Congress, Kishan Reddy, Medakmp, Siddipet, Telangana

తెలంగాణలో 5 బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మో( PM Modi )ది పాల్గొనబోతున్నారు.ఇక అమిత్ షా పర్యటనకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరాలను ప్రకటించారు.గురు,  శుక్రవారాలలో బన్సల్ తెలంగాణలో పర్యటిస్తారని, పెద్ద పెద్ద సభలు ,సమావేశాల కంటే డోర్ టు డోర్ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మే 13 వరకు నిర్మాణాత్మకంగా ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.ఎన్నికలకు కేవలం రెండు వారాలు సమయం ఉండడంతో బిజెపి అగ్ర నేతలు ఇక్కడ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

Telugu Amith Sha, Central, Congress, Kishan Reddy, Medakmp, Siddipet, Telangana

ఈ మేరకు బిజెపి అగ్ర నేతలు అంతా తెలంగాణలో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించారు.వారానికి మూడు లేదా నాలుగు సభలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.అమిత్ షా( Amith shah ) తెలంగాణకు వచ్చి సిద్దిపేటలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్,  బిఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు,  మరోసారి బిజెపి అధికారంలోకి రావలసిన ఆవశ్యకతను గురించి వివరించి తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టే విధంగా ఎన్నికల ప్రసంగం వినిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube