చిరంజీవి, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

నటుడు కిషోర్ కుమార్( Actor Kishore Kumar ) అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ కేరాఫ్ కంచరపాలెం సినిమా( Care Of Kancharapalem ) నటుడు అంటే చాలు గుర్తుపట్టేస్తారు.ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ కుమార్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించారు.

 Kancharapalem Actor Kishore Kumar Comments Bheemla Nayak Movie Details, Kanchara-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు కిషోర్ కుమార్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) వారి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

వీటి వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశాడు.షూటింగ్ జరిగిన తర్వాత కూడా తన సీన్స్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదని అన్నాడు.

Telugu Acharya, Kishore Kumar, Bheemla Nayak, Chiranjeevi, Kancharapalem, Kirsho

ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.ఇంతకీ ఏం జరిగింది అతను పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి కామెంట్స్ చేశాడు అన్న విషయానికి వస్తే.వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో నటుడిగా మారాడు.ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగవాడిగా నటించాడు.

ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు.రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.

అలాగే చిరు నటించిన ఆచార్య’,( Acharya ) పవన్ నటించిన భీమ్లా నాయక్( Bheemla Nayak ) చిత్రాల్లో కూడా నటించారట.ఇదే విషయం గురించి ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

Telugu Acharya, Kishore Kumar, Bheemla Nayak, Chiranjeevi, Kancharapalem, Kirsho

ఆచార్య సినిమా కోసం 20 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను.బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.భుజంపై చేయివేసి మరీ మాట్లాడేవారు.తీరా మూవీ విడుదల అయ్యాక నా సీన్స్ కనిపించలేదు.ఎడిటింగ్‌లో తీసేశారు.భీమ్లా నాయక్ కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను.

మధ్య గ్యాప్ వచ్చింది.తర్వాత నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు.

ఎందుకలా చేశారో అర్థం కాలేదు.ఈ విషయాల్లో చాలా బాధపడ్డాను అని నటుడు కిశోర్ కుమార్ చెప్పుకొచ్చాడు.

ఒకరకంగా ఆ రెండు సినిమాల వల్ల తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు కిషోర్ కుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube