ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి బొత్స సత్యనారాయణ,( Minister Botsa Satyanarayana ) సీఎం జగన్ పై( CM Jagan ) ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
మంత్రి బొత్సను జగన్ తండ్రి సమానులు అనడంపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.బొత్స గతంలో వైఎస్ఆర్ ను( YSR ) తాగుబోతు అని తిట్టాడని, జగన్ కు ఉరి శిక్ష వేయాలని అన్నారన్నారు.
విజయమ్మను సైతం అవమాన పరిచాడని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తి అయిన బొత్స ఇప్పుడు జగన్ కు తండ్రి సమానులు అయ్యారని ఎద్దేవా చేశారు.జగన్ కేబినెట్ లో ఉన్న వారంతా ఒకప్పుడు వైఎస్ఆర్ ను తిట్టిన వారేనన్నారు.వీళ్లంతా తండ్రులు, అక్కలు, చెల్లెల్లు అన్నారు.
కానీ జగన్ కోసం పని చేసిన వాళ్లు, పాదయాత్రలు చేసిన వారు మాత్రం ఏమీ కారని చెప్పారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ లేరన్న షర్మల వై -అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని విమర్శించారు.