చిరంజీవి, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

నటుడు కిషోర్ కుమార్( Actor Kishore Kumar ) అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ కేరాఫ్ కంచరపాలెం సినిమా( Care Of Kancharapalem ) నటుడు అంటే చాలు గుర్తుపట్టేస్తారు.

ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ కుమార్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు కిషోర్ కుమార్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) వారి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

వీటి వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశాడు.షూటింగ్ జరిగిన తర్వాత కూడా తన సీన్స్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదని అన్నాడు.

"""/" / ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.

ఇంతకీ ఏం జరిగింది అతను పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి కామెంట్స్ చేశాడు అన్న విషయానికి వస్తే.

వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో నటుడిగా మారాడు.

ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగవాడిగా నటించాడు.ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు.

రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.అలాగే చిరు నటించిన ఆచార్య',( Acharya ) పవన్ నటించిన భీమ్లా నాయక్( Bheemla Nayak ) చిత్రాల్లో కూడా నటించారట.

ఇదే విషయం గురించి ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. """/" / ఆచార్య సినిమా కోసం 20 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను.

బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.భుజంపై చేయివేసి మరీ మాట్లాడేవారు.

తీరా మూవీ విడుదల అయ్యాక నా సీన్స్ కనిపించలేదు.ఎడిటింగ్‌లో తీసేశారు.

భీమ్లా నాయక్ కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను.మధ్య గ్యాప్ వచ్చింది.

తర్వాత నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు.ఎందుకలా చేశారో అర్థం కాలేదు.

ఈ విషయాల్లో చాలా బాధపడ్డాను అని నటుడు కిశోర్ కుమార్ చెప్పుకొచ్చాడు.ఒకరకంగా ఆ రెండు సినిమాల వల్ల తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు కిషోర్ కుమార్.

మెల్‌బోర్న్ టెస్టులో షాకింగ్ సంఘటన.. విరాట్ కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించిన ప్రేక్షకుడు