నెల్లిమర్ల “వారాహి విజయభేరి” ( Varahi Vijayabheri ) బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్( Chandrababu , Pawan Kalyan ) హాజరయ్యారు.ఈ సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర కోసం కనీసం ఒక్క ప్రాజెక్టు అయిన తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.ఏ ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది…కాబట్టి అప్పట్లో భోగాపురంకి విమానాశ్రయం తీసుకురావడం జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లిమర్లలో 2025 వ సంవత్సరం కల్లా.
అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేస్తానని చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది.విమానాశ్రయం వస్తే పరిశ్రమలు వస్తాయి.
ఈ క్రమంలో యువతకు ఉద్యోగాలు వస్తాయి.
పోలవరం పూర్తి కావాలి.ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పూర్తి కావాలి అని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.నదుల అనుసంధానం పూర్తయ్యి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని ఆకాంక్షించెను.
కానీ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి.ఇష్టానుసారంగా పాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్డీఏ సభలకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీలో గుబులు మొదలైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ) అన్నారు.‘ప్రజలందరినీ జగన్ తన బానిసలుగా చూస్తున్నారు.జగన్ అహంకారి, విధ్వంసకారుడు.ఎన్నికలప్పుడు ఏదో ఒక నాటకం ఆడటం జగన్కు అలవాటు.ఇప్పడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు.ఈ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు.
ప్రజల కలలు చెరిపేసిన దుర్మార్గుడు జగన్’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.