మరాఠీ టీవీ, సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయిన చిన్మయ్ మండ్లేకర్( Chinmay Mandlekar ) ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నాడు.సాధారణంగా నెటిజన్లు సెలబ్రిటీల పర్సనల్ మ్యాటర్స్ లో కలగజేసుకుంటారు.
వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తుంటారు.మీరు చేసే అవమానకర కామెంట్స్ పోస్టులు చూస్తే మనిషన్నాక ఎవరికైనా చాలా బాధ కలుగుతుంది.
అయితే సెలబ్రిటీలు( Celebrities ) ఎవరేమీ వాగితే తమకేంటి అనే మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి.అప్పుడే కెరీర్ ప్రశాంతంగా కొనసాగించగలం కానీ చిన్మయ్ మండ్లేకర్ ఇలాంటి మానసిక సామర్థ్యాన్ని సాధించినట్లు లేదు అందుకే ఆయన ప్రస్తుతం నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్‌కు బాగా ఫీల్ అయిపోతున్నాడు.
ఇంతకీ ఈ నటుడిని ఇంటర్నెట్ యూజర్లు ఎందుకు టార్గెట్ చేశారంటే ఈ నటుడు 2009లో నేహా మండ్లేకర్ ఆయన యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు 11 ఏళ్ల క్రితం ఒక కుమారుడు పుట్టాడు.అతనికి జెహంగీర్( Jehangir ) అనే పేరు పెట్టుకున్నారు.
జెహంగీర్ అనేది ఒక మొఘల్ పాలకుడి పేరు.అయితే మొఘల్ పాలకులు హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారని, హిందువులను చంపేశారని చరిత్ర చెబుతోంది.
చిన్మయ్ మండ్లేకర్ మహారాష్ట్ర మరాఠీ కుటుంబంలో పుట్టాడు.అంతేకాదు శివరాజ్ అష్టక్( Ashtak ) అనే సినిమా సీరీస్‌లో శివాజీ మహారాజ్ అనే పాత్ర చేస్తున్నాడు.ఇప్పటికే ఆరు సినిమాల్లో అదే పాత్రను అతను చేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇంకో రెండు సినిమాలు చేస్తే ఆ సిరీస్ పూర్తవుతుంది.మహారాష్ట్ర ప్రజలకు శివాజీ అంటే చాలా ఇష్టం.అలాంటి శివాజీ పాత్రను వేస్తున్న చిన్మయ్ తన కొడుకుకి హిందూ వ్యతిరేకి పేరు పెట్టడం చాలామందికి నచ్చలేదు.
శివాజీ రోల్ ప్లే చేస్తూ ఆ మొఘల్ పాలకుడి పేరు కుమారుడికి ఎందుకు పెట్టావు అంటూ అతడిని బాగా ఏకిపారేస్తున్నారు.ఇక అతడి భార్యను మరింత దారుణంగా విమర్శిస్తున్నారు.
నికార్సైన హిందూ, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు శివాజీ.మొఘల్ అంటేనే శివాజీ సపోటర్లకు అసలు నచ్చదు.అందుకనే ఈ ట్రోలింగ్.జెహంగీర్ మొఘల్ పాలకులలో నాలుగో వాడు, ఆయన 1605 నుంచి 1627 వరకు పరిపాలించాడు.‘జెహంగీర్ అంటే ప్రపంచాన్ని జయించిన వాడు” అనే అర్థం వస్తుంది కాబట్టి ఈ పేరును తన భార్య ఎంచుకుందని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు చిన్మయ్.భారతదేశంలో కొంతమంది ప్రముఖుల పేర్లలో జెహంగీర్ అనే పేరు ఉందని, వారిని ఏమీ అనని ఇంటర్నెట్ యూజర్లు తన కొడుకు, తననే ఎందుకు ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు కూడా.
చిన్మయ్ సిరీస్ లో మిగిలిన రెండు సినిమాలు చేసేందుకు కూడా ఒప్పుకోవడం లేదు.ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది.