శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి , ఎంపీ అభ్యర్థి వరప్రసాద్

ఉమ్మడిపార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి( Bojjala Sudhir Reddy ) మరియు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్,( Varaprasad ) ఎన్నికల ప్రచారం.శ్రీకాళహస్తిలోని 23వ వార్డు నిర్వహించారు, ప్రజలు అడుగడుగున ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థికి శాలువాలతో సత్కరిస్తూ కర్పూర హారతులు నిరాజనాలు పడుతూ స్వాగతం పలికారు, ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఈ పర్యాయం ఉమ్మడి పార్టీ గెలిచిన వెంటనే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తారో ,ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు,బిజెపి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, మరియు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేడు ఉమ్మడి పార్టీల నాయకులు శ్రీకాళహస్తిలో ప్రచారం కొనసాగించారని, ప్రజలు అడుగడుగునా ఉమ్మడి పార్టీల అభ్యర్థులను ఆశీర్వదిస్తూ బ్రహ్మరథం పట్టారని ,ఈరోజు శ్రీకాళహస్తిలో ఉమ్మడి పార్టీల నాయకులపై ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానాలే రానున్న ఎన్నికల్లో విజయ తార్కానులగా మారి , తమకు అఖండ మెజార్టీని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 Mla Candidate Bojjala Sudhir Reddy And Mp Candidate Varaprasad Campaigned In Sri-TeluguStop.com

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి( Biyyapu Madhusudhan Reddy )పై అతని అనుచరులే శ్రీకాళహస్తి దేవస్థానంలో వెండి దోచుకుని వెళ్లారని బహిరంగ విమర్శలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తి మరోమారు గెలిపిస్తే నియోజకవర్గన్ని అవినీతితో అరాచకాలతో, శ్రీ కాళహస్తి నియోజకవర్గం నాశనం చేస్తాడని, ఈసారి తిరుపతి జిల్లా అభివృద్ధి చెందాలన్న కాళహస్తిలో అవినీతి పారదోలాలన్న, శ్రీ కాళహస్తి నియోజకవర్గం లోని ప్రజలు ఒక ఓటును కమలం గుర్తుకు, మరో ఓటును సైకిల్ గుర్తుకు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube