నేటితో ముగియనున్న సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!

ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) ఇవాళ్టితో ముగియనుంది.ఈ మేరకు టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో జరిగే భారీ బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది.

 Cm Jagan Memantha Siddham Bus Yatra Ends Today..!,memantha Siddham Bus Yatra,cm-TeluguStop.com

శ్రీకాకుళం జిల్లాలోని అక్కివలస నుంచి సీఎం జగన్( CM YS Jagan ) బస్సు యాత్ర ప్రారంభం కానుంది.ఇవాళ ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది.

కాగా అక్కివలస నుంచి మొదలుకానున్న బస్సు యాత్ర చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా కోటబొమ్మాళి మీదుగా యాత్ర సాగనుంది.మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ లంచ్ బ్రేక్ తీసుకోనున్నారు.

తరువాత టెక్కలి నియోజకవర్గం( Tekkali Constituency )లోని అక్కవరంకు బస్సు యాత్ర చేరుకోనుంది.ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు అక్కవరంలో జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కాగా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ భారీగా జనసమీకరణ చేస్తుంది.మరోవైపు యాత్ర ముగిసిన తరువాత సీఎం జగన్ విజయవాడకు వెళ్లనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube