తమిళ్ సినిమా ( Tamil movie ) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ధనుష్( Dhanush ) ఇప్పటికే ఈయన యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఈ జనరేషన్ లో తనను మించిన నటులు మరొకరు లేరు అనేలా వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే తన నటన పట్ల ప్రేక్షకులు మంచి ఆసక్తిని కనబరుస్తున్న నేపథ్యంలో అదే రీతిలో నటనను చూపిస్తూ తనదైన గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన తెలుగు సినిమాల మీద కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకు ముందే వెంకీ అట్లూరి ( Venky Atluri ) దర్శకత్వంలో సార్ అనే సినిమా చేశాడు.ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) డైరెక్షన్ లో కుబేర అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే తెలుగులో కూడా ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడుతుంది.అయితే కుబేర సినిమా ఒక డిఫరెంట్ ఆటంప్ట్ అని ఇప్పటికే శేఖర్ కమ్ముల తెలియజేశాడు.
ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తే తెలుగులో కూడా ఆయనకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది ఇక సార్ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు ఆయనవి తెలుగులో రిలీజ్ అయినప్పటికీ అవి పెద్దగా మ్యాజిక్ అయితే చేయలేకపోయాయి.కాబట్టి డైరెక్ట్ గా మళ్లీ తెలుగులో సినిమా చేసి సక్సెస్ కొడితేనే తెలుగు అభిమానులు తనకు దగ్గరవుతారనే ఉద్దేశ్యం తో తను ఇలాంటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ధనుష్ అనుకున్నట్టుగానే తనకు సక్సెస్ లు దక్కుతాయా లేదా అనేది…
.