వై.ఎస్.జగన్ గురించి చాలామందికి ఆసక్తికర విషయాలు ఇవే..!

పులివెందుల నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమెల్యేగా ఎన్నుకోబడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వై.ఎస్.

 Unknown Interesting Facts About Ys Jagan-TeluguStop.com

జగన్మోహన్ రెడ్డి (జగన్) గారి గురించి కొత్త పరిచయం అవసరం లేదు అనుకుంట.ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ఏకైక పుత్రుడు.భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం , సండూరూ జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు అనే విషయాలు అందరికి తెలిసినవే.

కాబట్టి ఇప్పుడు జగన్ గారి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము.

1972 లో పులివెందులలో జగన్ జన్మించారు.

పులివెందులలో ప్రాథమిక విద్యనభ్యసించి తర్వాత హైదరాబాద్ బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 12 వ తరగతి వరకు చదువుకున్నారు.తర్వాత నిజాం కాలేజీ లో బికాం చదివారు.

తర్వాత లండన్ లో ఎంబీఏ చేయడానికి వెళ్లారు.కానీ అక్కడి చదువు మధ్యలో ఆపేసి వచ్చేసారు.

1996 లో డాక్టర్ గంగి రెడ్డి కుమార్తె భారతిని పెళ్లాడారు జగన్.గంగి రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఎం.బి.బి.ఎస్ లో క్లాస్ మేట్స్.భారతి తల్లితండ్రులు ఇద్దరు డాక్టర్లు.

వ్యాపారాలు చేస్తూ బిజీ గా ఉన్న జగన్ 2009 లో కడప ఎం.పీ గా పోటీ చేసి గెలిచారు.

రాజకీయాల్లోకి రాకముందు జగన్ బెంగుళూరు లోని లాంకో హిల్స్ లో పనిచేసేవారు.

జగన్ కి ఇద్దరు కూతుర్లు.పెద్ద కూతురు వర్ష రెడ్డి.చిన్న కూతురు హర్ష రెడ్డి.పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించి సంచలనం సృష్టించిన విషయం చాలామందికి తెలిసిందే.

2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతి స్వల్ప ఓట్ల శాతం (1.25)తో పరాజయం పొంది ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు.సొంత పార్టీ పెట్టి 70 సీట్లు సాధించిన ఘనత ఎన్ఠీఆర్ తర్వాత జగన్ కే చెందుతుంది.

ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 4 సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాడుతూ, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో సుమారు 3000 కి.మీ దూరం పాదయాత్ర చేస్తున్నారు.

గాంధీ గారి తర్వాత జైలు లో దీక్ష చేసింది జగన్ ఒక్కరే.సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం జగన్ గారు జైలు లో దీక్ష చేసారు.

తన తండ్రి మరణించిన సమయంలో ఓదార్పు యాత్ర చేసిన ఒకేఒక్క నాయకుడు జగన్.

రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కడప బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ జగన్ గారు.సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లాంటి ఫ్యాక్షన్ సినిమాల వల్లే జగన్ బాలకృష్ణ కి ఫ్యాన్ అయ్యారని అప్పట్లో ఒక టాక్.

జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఏర్పరిచిన బహిరంగ సభల్లో దాదాపు 75 లక్షల మంది హాజరయ్యారు.ఇదో అరుదైన రికార్డ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube