విజయనగరం “ప్రజాగళం” బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే… వికలాంగులకు ₹4000 ఉన్న పెన్షన్ ₹6000 చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగుదేశం ఒక బ్రాండ్.గతంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చేశామో అందరికీ తెలుసు.
అలాగే రాష్ట్రంలో ఐటీ రంగం పుంజుకోవడానికి కూడా.టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు.
సంపద సృష్టించి.పేదలను ఆదుకుంటామని.
చంద్రబాబు( Chandrababu ) సంచలన స్పీచ్ ఇచ్చారు.రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సహకారంతోపాటు కేంద్రంలో మోదీ సహకారంతో.
ముందుకు సాగుతామని అన్నారు.
2047 కల్లా.ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉండేలా మోదీ ( Modi ) ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.దేశంలో పేదరికం లేకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అలాగే తాను.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )దేశంలో ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలన్నది తమ ఆశయమని అన్నారు.
దేశంలో పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నీ తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం.ఉత్తరాంధ్ర పై ప్రత్యేకమైన దృష్టి ఉండటం వల్లే గతంలో అశోక్ గజపతిరాజు, దివంగత ఎర్రం నాయుడికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీలో ఎన్నికలకు ఇంక మూడు వారాలు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో మే మొదటి వారంలో ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి రెడీ అయ్యారు.
దాదాపు రెండు రోజులపాటు ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.