శ్రీకాకుళం జిల్లా అక్కవరంలో సీఎం జగన్( CM Jagan ) ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అక్కవరంలో జన సముద్రం కనిపిస్తోందని తెలిపారు.ఏపీలో డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర వైసీపీ( YCP ) జైత్రయాత్రకు సంకేతమని పేర్కొన్నారు.వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని తెలిపారు.
చంద్రబాబుకు( Chandrababu ) ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న సీఎం జగన్ ఈ ఎన్నికలు ప్రతి ఇంటి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.ఈ క్రమంలో పెత్తందారుల ముఠాపై యుద్ధానికి సిద్ధమని తెలిపారు.గతంలో చంద్రబాబు ఏం చెప్పారు? ఏం చేశారని ప్రశ్నించారు.2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు మోసాలకు చెంప చెళ్లుమనిపించేలా ఓటుతో సమాధానం చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు.







