అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ( Nikki Haley ) తుది రేసులో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.రిపబ్లికన్ నామినేషన్ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో( Donald Trump ) పోటీపడినప్పటికీ ఆయన దూకుడు , వ్యూహాల ముందు నిక్కీ హేలీ నిలబడలేకపోయారు.
అయితే పెన్సిల్వేనియాలోని( Pennsylvania ) రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లలో మెజారిటీ భాగం నిక్కీహేలీకే ఓటు వేశారు.పెన్సిల్వేనియా జీవోపీ ప్రైమరీలో కనీసం 1,47,000 ఓట్లను నిక్కీ సాధించారు.ఇప్పటి వరకు 90 శాతానికి పైగా ఓట్లను లెక్కించారు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో నాటి డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ దాదాపు 68 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.మంగళవారం జరిగిన జీవోపీ ప్రైమరీలో( GOP Primary ) ట్రంప్ సునాయాసంగా విజయం సాధిస్తారని అంచనా వేశారు.ఏపీ మీడియా సంస్థ అంచనాల ప్రకారం 92 శాతం ఓట్లలో 84 శాతం ట్రంప్ కైవసం చేసుకుంటారని వెల్లడించింది.
కానీ నిక్కీ హేలీ మంగళవారం అర్ధరాత్రి నాటికి 17 శాతం ఓట్లను పొందారు.
అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియాది కీలకపాత్ర.దీని ఫలితం నవంబర్‌లో ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.2020లో జో బైడెన్( Joe Biden ) దాదాపు 80,500 ఓట్లతో ఇక్కడ విజయం సాధించారు.దేశవ్యాప్తంగా జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలలో ట్రంప్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ .వైట్‌హౌస్‌లో మరోసారి ఆయన అడుగుపెట్టడానికి పలు ప్రతిబంధకాలు వున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అరిజోనా,( Arizona ) విస్కాన్సిన్( Wisconsin ) వంటి కీలమైన స్వింగ్ స్టేట్స్‌లలో జీవోపీ ప్రాథమిక ఓటర్లలో 5వ వంతు ట్రంప్ కాకుండా మరో అభ్యర్ధిని ఎంచుకున్నారు.ఇటీవల ట్రంప్ న్యాయ పోరాటాల నేపథ్యంలో పెన్సిల్వేనియా ప్రైమరీ తెరపైకి వచ్చింది.
న్యూయార్క్ క్రిమినల్ కేసులో 34 కౌంట్ల నేరారోపణలు, కోర్టు విచారణల కారణంగా ట్రంప్ ప్రచారానికి అవరోధాలు కలిగే అవకాశం వుంది.
కాగా .వాషింగ్టన్ డీసీలో వున్న సంప్రదాయ థింక్ ట్యాంక్ అయిన హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో నిక్కీహేలీ చేరినట్లు దాని సీఈవో, చైర్‌పర్సన్ వాల్టర్ పీ స్టెర్న్ ఒక ప్రకటనలో తెలిపారు.నిక్కీ విదేశీ , దేశీయ విధానం రెండింటిలోనూ నిరూపితమైన సమర్ధవంతమైన నేత.ప్రపంచవ్యాప్త రాజకీయ తిరుగుబాటు యుగంలో ఆమె అమెరికన్ భద్రత, శ్రేయస్సుకు శ్రమించారని జాన్ పీ వాల్టర్స్ ప్రశంసించారు.నిక్కీ హేలీ హడ్సన్ టీమ్‌లో చేరడం తమకు గర్వకారణమని వాల్టర్స్ వ్యాఖ్యానించారు.