ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉంది.ఈ ఎన్నికలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది.

 Modi Two Day Visit To Andhra Pradesh Election Campaign , Modi, Ap Elections , Bj-TeluguStop.com

ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ.( BJP ).జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఫిబ్రవరి నెల ఆఖరిలో బీజేపీతో పొత్తు ఖరారు అయింది.

ఆ సమయంలో మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా బొప్పూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ సభకు ప్రధాని మోదీ( Prime Minister Modi ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆ తర్వాత మరెప్పుడూ కూటమి తరుపున ఏపీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొనలేదు.

మరోపక్క ఎన్నికలకు ఇంక మూడు వారాలు మాత్రమే సమయం ఉంది.సో ఇటువంటి పరిస్థితులలో ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు.మే 3, 4 తేదీల్లో మోదీ ఏపీకి వస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ తెలిపింది.

ఈ రెండు రోజుల పర్యటన కోసం రోడ్ షోలు, సభా వేదికలను నేతలు ఖరారు చేయనున్నారు.బీజేపీ-టీడీపీ-జనసేన( BJP-TDP-Janasena ) ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా మోదీ ప్రచారం నిర్వహించనున్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో ప్రజలకు పలు హామీలు కూడా ప్రకటిస్తున్నారు.బీజేపీ తరఫున పలువురు కేంద్రమంత్రులు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.కాగా ఇప్పుడు మోదీ పర్యటన.

కూడా ఖరారు కావడంతో కూటమిలో ఉత్సాహం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube