కెన్యాలోని మౌంట్ ఎల్గాన్ నేషనల్ పార్క్‌లో ఉన్న కితుమ్ గుహా( Kitum Caves )లను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహాలుగా భావిస్తారు.ఇటీవలి నివేదికలు ఈ గుహా కుహరం మానవులకు తెలిసిన అతి ప్రాణాంతకం వైరస్‌లకు నిలయమని, ఇదే తదుపరి పెద్ద వ్యాధికి కారణమయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి.
ఇబోలా, మార్బర్గ్ వైరస్‌లు కితుమ్ గుహాల నుంచే పుట్టినట్లు భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) మార్బర్గ్ వైరస్‌ను పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న వైరస్‌గా గుర్తించింది.శాస్త్రవేత్తలు దాని వ్యాప్తి పట్ల ఆందోళన చెందుతున్నారు.1980ల్లో షుగర్ మిల్లు దగ్గర పనిచేస్తున్న ఓ ఫ్రెంచ్ ఇంజనీర్ ఈ ప్రమాదకరమైన గుహాన్ని పరిశీలించగా, దురదృష్టవశాత్తు మార్బర్గ్ వైరస్‌తో బాధపడ్డాడు.ఈ వైరస్ వల్ల శరీర కణజాలాలు కరిగిపోవడంతో, అతని ముఖం దాదాపుగా వేరుపడిపోయి మరణించాడు.ఆ తరువాత కొన్నేళ్ళకు రావన్ అనే డానిష్ బాలుడు కుటుంబంతో సెలవుల్లో ఉన్నప్పుడు ఈ వైరస్ బారిన పడి మృతి చెందాడు.
కితుమ్ గుహాల్లో ఉప్పు ఖనిజాల నిల్వలు ఏనుగులు, దున్నలు, జింకలు, చిరుతపులు, హైనాలు వంటి పశువులను అట్ట్రాక్ట్ చేస్తాయి.పశ్చిమ కెన్యా నుంచి వీటిని ఇక్కడికి ఆకర్షిస్తుంది.ఈ ప్రత్యేకమైన వాతావరణం కితుమ్ గుహాలను “జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులకు” ( Zoonotic Infections ) పుట్టుక వాకిలిగా మార్చేసిందని పరిశోధకులు భావిస్తున్నారు.అంతేకాకుండా, 600 అడుగుల లోతైన ఈ గుహాన్ని ఏనుగులు తవ్వడం వల్ల, వ్యాధి వ్యాపింపజేసే బ్యాట్స్ నివసించేందుకు అనువైన ప్రదేశంగా మారింది.
అమెరికా సైనిక వైద్య పరిశోధన సంస్థ ( USAMRIID ) కితుమ్ గుహా అన్వేషణలో వైరస్‌ను గుర్తించడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమైంది.అయినప్పటికీ, పదేళ్లకు పైగా మధ్య ఆఫ్రికా అంతటా ఉండే ఫ్రూట్ బ్యాట్స్‌లో మార్బర్గ్ వైరస్ RNA ఉందని గుర్తించారు.ఈ వైరస్ సోకిన వ్యక్తి శరీర ద్రవాలతో సంపర్కం ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందవచ్చు.అంతేకాకుండా, వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన రక్తం, టవల్లు వంటి వస్తువులను తాకడం ద్వారా కూడా పరోక్షంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
నివేదికల ప్రకారం, మార్బర్గ్ వైరస్ చాలా ప్రాణాంతకం.ఈ వైరస్ సోకిన 88 శాతం మంది వరకు మరణించే ప్రమాదం ఉంది.