వేసవికాలంలో( Summer ) వేడి నుండి ఉపశమనం పొందాలంటే ఇంట్లో నిరంతరం ఏసీలు లేదంటే కూలర్లు పనిచేయాల్సిందే.ఇక 24 గంటలు ఇవి ఆన్ లో ఉంటే కరెంట్ బిల్లు ఎంత ఎక్కువగా వస్తుందో ఊహించడం కూడా కష్టమే.
అంతేకాదు ఏసీ, కూలర్ల గాలి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఇంకా కొంతమంది ఆర్థిక పరిస్థితులు వల్ల ఏసీలు, కూలర్లు కూడా కొనలేకపోతున్నారని తెలిసిందే.
మరి ఏసీలు, కూలర్లు లేకుండానే వేసవికాలంలో ఇంటిని చల్లగా ఉంచే కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం.
వేసవికాలంలో ఇంటి పైకప్పు పై తెల్లటి పెయింటింగ్( White Painting ) వేయించాలి.
తెలుపు రంగు వేడిని ఎక్కువ గ్రహించదు కాబట్టి ఇంటి లోపల ఎక్కువగా వేడి చేరే అవకాశం ఉండదు.ఇక ఇంటి ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు పెరిగేలా చూసుకోవాలి.
ప్రస్తుత కాలంలో ఇంటి ఆవరణలో పెద్దపెద్ద చెట్లు అంటే కష్టమే.కాబట్టి కనీసం ఇంటి బాల్కనీలో వీలైనంత చెట్లు( Trees ) ఉండేలా చూసుకుంటే వాటి వల్ల ఇంటి లోపలికి చల్లటి గాలి ప్రవేశిస్తుంది.
వేసవికాలంలో ఇల్లు మరింత చల్లగా ఉండాలంటే.ఖుస్ మత్ చెక్కతో చేసిన చాపను ఇంటి తలుపులకు వేలాడదీయాలి.అంతేకాదు ఇంట్లోకి సూర్యరశ్మి వచ్చే చోట, వెంటిలేషన్ ఎక్కువగా ఉండే చోట, ఈ చాపలను ఒక కర్టెన్ లాగా వేలాడదీసి అప్పుడప్పుడు వీటిపై నీటిని చల్లుతూ ఉండాలి.ఇంటి లోపల వెంటిలేషన్( Ventilation ) ఎక్కువగా ఉంటే ఇల్లు చాలా చల్లగా ఉంటుంది.
ఎందుకంటే వెంటిలేషన్ ఎక్కువగా ఉంటే గాలి ఎక్కువగా లోపలికి ప్రవేశిస్తుంది.
బయట నుండి ఇంటి లోపలికి గాలి ప్రవేశించే దిశలో పెద్దపెద్ద వస్తువులు లేకుండా చూసుకోవాలి.ఈ వస్తువులు గాలి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం ఉంది.వేసవికాలంలో ఇంటికి లేత రంగు కర్టెన్లను మాత్రమే వాడాలి.
ఆ కర్టెన్లు కూడా కాస్త మందపాటివి అయి ఉండాలి.ఇలా ఈ పద్ధతులను పాటిస్తే ఏసీలు, కూలర్లు లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.