నిజామాబాద్‌ జిల్లాకు బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీలు చేసింది శూన్యం : ధర్మపురి సంజయ్

నిజామాబాద్‌ జిల్లాకు, నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బిజెపి, బిఅర్‌ఎస్‌( BJP, BRS ) పార్టీలు చేసింది శూన్యం అని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఎంపిగా ఉన్న పదేళ్ల పాలనలో జిల్లాను మరో పదేళ్ల పాటు వెనక్కి నెట్టివేసారనీ నిజామాబాద్ నగర మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి సంజయ్ మండిపడ్డారు.

 Bjp And Brs Parties Have Done Nothing For Nizamabad District: Dharmapuri Sanjay-TeluguStop.com

బిఅర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన భూకబ్జాలు చేశారని వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని అన్నారు.

మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పసుపుబోర్డును తెరమీదకు తెచ్చారనీ,కానీ ప్రణాళిక బద్దంగా పని చేయకపోవడం, ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని హామి ఇచ్చి అ ఫ్యాక్టరీనీ అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు చేసారని,అందుకే రైతులు అమెను గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒడిరచారన్నారు.అదే పసుపు బోర్డు, షుగర్‌ ఫ్యాక్టరీ వ్యవహారాలను అడ్డం పెట్టుకొని బిజెపి, నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అరవింద్‌( Arvind Dharmapur ) గెలిచడనిపసుపు బోర్డును పాతరేసి, నామ మాత్రంగా రైతులను నమ్మించేందుకు స్సైసెస్‌ బోర్డును తెచ్చారనీ.

పసుపు లేని స్సైసెస్‌ బోర్డు ఏందుకో పిఎం మోడీ, బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌లు పసుపు రైతులకు సమాధానం చెప్పాలన్నారు.ఇక ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీ విషయంలో ఎంపి అరవింద్‌ పాదయాత్ర చేసి మరి హామి ఇచ్చారనీ.

ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెబుతున్నారనీ న్నారు.దేశ ప్రధాన మంత్రి ప్రకటన చేసి తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.

కానీ తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది ఇప్పటి వరకు చెప్పలేదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube