రూ.22 వేల కోట్లతో 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తాం:మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

 We Will Build 4.5 Lakh Houses With Rs.22 Thousand Crores, Said Minister Uttam ,-TeluguStop.com

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని రామస్వామి గుట్ట హౌసింగ్‌ కాలనీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లుగా హౌసింగ్‌ రంగాన్ని గత బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్ల చొప్పున రూ.22 వేల కోట్లతో 4.5 లక్షల ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై వంటి కేంద్ర గృహ నిర్మాణ పథకాల్లో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube