టిఆర్ఎస్ లో ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ నాయకుల్లారా ఇకనైనా కళ్లు తెరవండి.టీఆర్ఎస్,సీఎం కేసీఆర్ నిజ స్వరూపాన్ని తెలుచుకోండి.
కేసీఆర్ కు బహుజనులంటే కేవలం ఓట్లు వేసి యంత్రాలు మాత్రమే.ఓట్లు మనవి,సీట్లు వారికా?బహుజనుల తడాఖా ఏంటో చూపించాలి.-బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత.నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్ల భర్తీ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ,సీఎం కేసీఆర్ బీసీ,ఎస్సి,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని,బీసీ ఉద్యమనేత,మునుగోడు బీఎస్పీ నాయకులు పెండెం ధనుంజయ్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి ప్రకటించిన రాజ్యసభ సీట్ల భర్తీ ప్రక్రియను చూస్తే ఈ రాష్ట్రంలో బహుజనులకు టీఆర్ఎస్ పార్టీ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి విలువిస్తున్నారో తేటతెల్లమైందన్నారు.రాష్ట్రంలో ఉన్న మూడు సీట్లను అగ్రవర్ణాలకు కట్టబెట్టి తన నైజాన్ని చాటుకున్నారని మండిపడ్డారు.
అగ్రవర్ణాలలో కూడా పేదలున్నారని,అందులోనూ తెలంగాణ కోసం తన్నులాడిన వారు ఎంతో మంది ఉన్నారని,వారిని పక్కన పెట్టి,బడా పారిశ్రామిక వేత్తలకు పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు.వీళ్ళు రాజ్యసభకు వెళ్లి తెలంగాణ హక్కుల కోసం ఏం పోరాడుతారని ప్రశ్నించారు.
రాజ్యసభ ఎంపీ పదవులు పొందిన దామోదరరావు,హెటిరో పార్థసారధి రెడ్డి,గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర ముగ్గురూ కేవలం వారి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుని,కొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించుకున్నవారేనని,వారి ఆస్తులు ఇంకా పెంచుకోడానికి,కాపాడుకోడానికే ఈ పదవులు వాళ్ళకి విజిటింగ్ కార్డులాగ ఉపయోగపడతాయి తప్ప దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి,ఇక్కడి ప్రజలకు నయాపైసా ఉపయోగం లేదన్నారు.ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు చట్ట సభలపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు,సీఎం కేసీఆర్ కి బహుజనులంటే కేవలం ఓట్లు వేసే వ్యక్తులుగా కనబడుతున్నారని, ఓట్లు మనవి,సీట్లు మాత్రం వారికా? ఆలోచన చేయాలని కోరారు.తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలలోని వ్యక్తులు రాజ్యసభకు అర్హులు కారా? అని సూటిగా ప్రశ్నించారు.వచ్చే శాసనసభ ఎన్నికల్లో బహుజనులంతా ఓటు ద్వారా కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సీట్ల భర్తీలో కేసీఆర్,టీఆర్ఎస్ పార్టీ అసలు రంగు బట్టబయలైందని,ఇప్పటికైనా టీఆర్ఎస్ లో తిరిగే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ నాయకులు, కార్యకర్తలు కళ్లు తెరవాలని సూచించారు.