ఓటమి విజయానికి నాంది: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: క్రీడల్లో ఎదురయ్యే ఓటమిని విజయానికి నాందిగా మార్చుకుని క్రీడాకారులు పైపైకి ఎదగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగే క్రికెట్ టోర్నీని మంత్రి ప్రారంభించి కొద్ది సేపు బ్యాటింగ్ చేసి అలరించారు.

 Defeat Is The Beginning Of Victory Minister Jagdish Reddy, Minister Jagdish Red-TeluguStop.com

మెడికల్ కాలేజ్,ప్రభుత్వ హాస్పిటల్ టీమ్ లకు టాస్ వేసిన మంత్రి ఇరు జట్లకు విషెస్ తెలియజేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ యువత జీవితంలో ఎదగడానికి క్రీడా స్ఫూర్తి ఎంతగానో ఉపయోగకరం అన్నారు.

ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకు యువత అఘాయిత్యాలకు పాల్పడటానికి కారణం క్రీడలు ఆడకపోవడమే అన్నారు.

క్రీడలతో మానసిక,శారీరక దృఢత్వం అలవడుతుందని అన్నారు.

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, ఓడిపోయినా నిరుత్సాహ పడకూడదని,గెలుపొందిన వారు గెలిచామని గర్వపడకుండా స్నేహపూర్వకంగా క్రీడలను ఆడాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గుర్రం సత్యనారాయణ రెడ్డి,జూలకంటి జీవన్ రెడ్డి, ముదిరెడ్డి సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మేకపోతుల సంతోష్,క్రికెట్ టోర్నమెంట్ ఇంఛార్జీ వీరబాబు, ఆర్గనైజర్స్ సైదులు,నరేష్, అశోక్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube