మంత్రి జగదీష్ రెడ్డి తో రైస్ మిల్లర్ల భేటి.ధాన్యం కొనుగోలుకు ఎఫ్.
సి.ఐని ఒప్పించాలంటూ వినతి.ధాన్యం కొనుగోలుకు ఎఫ్.సి.ఐలు ముందుకు రావాలి.అందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతా.-మంత్రి జగదీష్ రెడ్డి.
సూర్యాపేట జిల్లా:ధాన్యం కొనుగోలకు ఎఫ్.సి.ఐలు ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.అందుకు కేంద్రం చొరవ చూపాలన్నారు.
యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యంతో గోడౌన్ లు నిండిపోయాయని, ఎఫ్.సి.ఐ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సూర్యాపేట,నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం మంత్రి జగదీష్ రెడ్డితో భేటి అయ్యారు.ఈ భేటీలో తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ పాల్గొన్నారు.
అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలతో తెలంగాణాకు ఇక్కట్లు ఎదురైతున్నాయని,అందులో మొదటిది వ్యవసాయ చట్టం అయితే రెండోది విద్యుత్ సంస్కరణలని చెప్పుకొచ్చారు.
ఆ రెండు చట్టాలు కూడా ఆదాని కోసమేనని స్పష్టం చేశారు.అదే గనుక జరిగితే ఓనర్లు గుమస్తాలు కావడం ఖాయమన్నారు.
ధాన్యం కొనుగోలు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.ఈకార్యక్రమంలో నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి,జనరల్ సెక్రెటరీ రేపాల భద్రాద్రి రాములు,గౌరవ అధ్యక్షులు కందుకూరి మహేందర్, నల్లగొండ సెంటర్ అధ్యక్షులు కర్నాటి నారాయణ, నకేరికల్ సెంటర్ అధ్యక్షులు కన్మంతరెడ్డి కేశవరెడ్డి, మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్,సూర్యాపేట రైస్ మిల్లర్స్ అధ్యక్షులు బోనాల రవీందర్,భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ జనరల్ సెక్రెటరీ నాగభూషణంలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ 150 మంది వరకు పాల్గొన్నారు.