మ్
సూర్యాపేట జిల్లా: విద్య లేకపోవడం అంటే చీకట్లో ఉండడమేనని, చీకటిలో మనం ఒక అడుగు ముందుకు వేయలేమని,అలాగే జీవితంలో ముందుకు పోవాలంటే వెలుగునిచ్చేది విద్య అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ పెరుమాళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరిచిపోకుండా వాళ్ళ స్ఫూర్తిని తరువాత తరాలకు అందించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.మనల్ని భూమ్మీదికి తీసుకురావడమే కాకుండా మనకు విద్యాబుద్ధులు నేర్పించినన తల్లిదండ్రులను మనం ఉన్నంత కాలం స్మరించుకుంటూ ఇతరులకు సేవా చేయవల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.
ఆ విషయాన్ని మరచిపోకుండా మన బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని అన్నారు.విద్యదానం చాలా గొప్పదని, విద్యను మించిన ఆయుధం లేదని,విద్య లేకపోతే అంతా చీకటేనని,పూర్వం భారత దేశంలో సమాన హక్కులు లేక,ఎంతో కోల్పోయిన మన దేశానికి ఎంతోమంది విద్యను అభ్యసించి మనకు స్వాతంత్రం తీసుకు వచ్చారని గుర్తు చేశారు.
భారతదేశంలో ఎన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉండి కూడా వందల సంవత్సరాలుగా మిగతా దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలోనే ఎక్కువ జనాభా ఉండి కూడా భారతదేశం వెనుకబడ్డ దేశాల్లో ఉన్నది అంటే దానికి కారణం విద్య లేకపోవడమే అన్నారు.ఈ సమాజంలో కొన్ని అవకతవకులకు గురై మనుషులందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేకపోవడం,దానితోని ప్రపంచంలో మిగతా దేశాలకు పోటీగా ఎదగడంలో భారతదేశం వెనుకబడిందన్నారు.
దేశంలో అందరూ సమానంగా లేకపోవడానికి ప్రధానమైన ఆటంకం విద్యని,అందుకే మన పెద్దలు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ, నెహ్రూ,డా.బి.ఆర్ అంబేద్కర్ తో సహా అందరూ కూడా ఆ రోజు ఈ దేశానికి మొట్టమొదటి విద్యా వంతులని అన్నారు.ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు,ఇప్పుడున్న సామాజిక కట్టుబాట్లను మార్చాలని,వెనుకబాటుతనాన్ని జయించాలని,ఇవాళ ఉన్న అంటరానితనం నుంచి ఆర్థిక అసమానతలు తొలగించి,ప్రజలను బయటపడించాలని చెప్పి,దానికి ఒక మంచి రాజ్యాంగాన్ని రాయలే అని చెప్పిన నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన బాధ్యత తీసుకొని మొత్తం ప్రపంచాన్ని చదివి భారతదేశ ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎవరెవరికి ఎటువంటి హక్కులు కల్పించాలి? రేపు ప్రభుత్వాలతోనే అద్భుతమైన సామాజిక విప్లవాలను ఎట్లా తేవాలి? అనే విషయాలన్నిటిని కూడా ఆలోచన చేసి ఒక అద్భుతమైన రాజ్యాంగం నిర్మించడం, ఆ రాజ్యాంగంతోని విద్యను ప్రజల యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తించడం,విద్యకు శ్రీరామరక్ష అయ్యిందని అన్నారు.జీవితానికి విద్యనే వెలుగని,అందుకే మన విద్య విషయంలో రాజీపడొద్దని సూచించారు.మనల్ని మన అమ్మానాన్న విద్య ద్వారా జీవితంలో ఎక్కడైతే స్థిరపడేలా చేసి,సమాజంలో ఒక ఉన్నతమైన గౌరవమైన స్థానం సంపాదించుకున్నమో మన చుట్టుపక్కల ప్రాంతాల పిల్లల కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి పెరుమాళ్ళ వారసులు కృష్ణ చైతన్య,శ్రీనివాస్,రాంబాయమ్మ,వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత పిల్లలకి విద్య పట్ల ఆసక్తి పెంచడానికి వారికి నోటుపుస్తకాలు అందజేసి సహాయపడడం అభినందనియమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.