రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి:సిపిఎం

నల్లగొండ జిల్లా: మధ్యాహ్న భోజనం కార్మికులను రోడ్డున పడేసి,కార్మికుల పొట్ట కొట్టే కేంద్రీకృత వంట విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరు కోటేష్, సిఐటియు మండల కన్వీనర్ కోమండ్ల గురువయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ఎంఈఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లకు వినతిపత్రం అందజేశారు.

 The State Government Decision Should Be Withdrawn Cpm, State Government , Cpm, M-TeluguStop.com

మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాలయాపనం చేస్తుందని వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వారు కోరారు.నిత్యవసర వస్తువుల ధరలు పెరిగినప్పటికీ పాఠశాల పిల్లలకు పెడుతున్నారని, సకాలంలో బిల్లులు లేకపోవడం వల్ల అప్పులు తీసుకొచ్చి భారంగా నడుపుతున్నామని.

కుటుంబాలను కష్టంగా ఉంటుందని వారు వాపోతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు వచ్చిన వాగ్దానం ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల జీవన భృతి వేతనంగా ఇవ్వాలని, ఇచ్చిన మాటను ప్రభుత్వ నిలబెట్టుకోవాలని వారు కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేంద్రీకృత వంట విధానం వల్ల, కాంట్రాక్టర్ల కే లబ్ది చేకూరుతుందని,దానివల్ల పౌష్టికాహారం,నాణ్యమైన ఆహారం పిల్లలకు అందదని,పాఠశాలలో వేడివేడిగా వండి పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఇబ్బందులు ఉన్న మధ్యాహ్నం భోజన కార్మికులు నాణ్యమైన వంట పిల్లలకు పెట్టడంలో రాజీ పడలేదని అటువంటి వారిని తొలగించి, సెంట్రలైజ్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చి మధ్యాహ్న భోజన కార్మికుల పోట్టగొట్టడం సరైంది కాదని,ఆ విధానాన్ని విరమించుకొని కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు యాదగిరి, ఒట్టికోటి అంజమ్మ, సైదమ్మ,అండాలు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube