నల్లగొండ జిల్లా:అపరిశుభ్రంగా మారిన నకిరేకల్ ఏరియా ఆస్పత్రిని పరిశుభ్రంగా మార్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.మంగళవారం పీఆర్ పీఎస్ నాయకులతో కలిసి నకిరేకల్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి,అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి అపరిశుభ్రతపై సూపరింటెండెంట్ గణపతి శ్రీనాధ్ ను ప్రశ్నించారు.మురుగు బయటికి వెళ్ళడానికి మార్గం లేదని సమాధానం ఇవ్వడంతో మీరు చెప్పిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నకిరేకల్ ఏరియా ఆస్పత్రి లోపలగానీ బాహ్య పరిసరాలు గానీ శుచి శుభ్రత లేకుండా అత్యంత అపరిశుభ్రంగా మారాయని దీనికి ఎటువంటి జాగ్రత్తలు,పరిష్కారాలు వెతకడం లేదని,పైన పటారం లోన లొటారంలాగా నకిరేకల్ ఆస్పత్రి పరిస్థితులు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.వీటి కారణంగా రోగుల యొక్క ఆరోగ్య పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు.
ఆసుపత్రి వెనుక భాగంలో మానవ విసర్జితాలన్నీ బహిర్గతంగా ప్రవహిస్తున్నాయని,ఎందుకు అట్టి మురుగుపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో వేములకొండ మహేష్ గౌడ్, రాచకొండ సైదులుగౌడ్,ఎన్నమళ్ళ పృథ్వీరాజ్, పోతెపాక విజయ్,ఏ.
ప్రదీప్,రవీందర్,మహేశ్వరం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.