సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లోని శ్రీసాయిభవాని మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో మున్సిపాలిటీ సిబ్బంది నీటి పైపులైన్ మరమ్మత్తుల్లో భాగంగా గుంతను తవ్వుతున్నారు.ఈ క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ కు గడ్డపార తగలడంతో పైపు పగిలి గ్యాస్ పైకి వచ్చింది.
ఏం జరుగుతుందో అర్థం కాక టీచర్లు,580మంది విద్యార్థులు వెంటనే ఒక్కసారిగా స్కూల్ ఆవరణంలో నుండి బయటికి పరుగులు పెట్టారు.సకాలంలో పోలీసులు,ఫైర్, గ్యాస్ సిబ్బంది స్పందించడంతో పేను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.