దళిత కుటుంబానికి దక్కని పతకాలు...!

సూర్యాపేట జిల్లా: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గప్పాలు కొడుతున్న నేపథ్యంలో 8 ఏళ్ల నుండి ఉండడానికి నిలువ నీడ లేకుండా,ఊరి చివర రేకుల షెడ్డు వేసుకొని,చుట్టూ గ్రీన్ మ్యాట్ తో దుర్బర జీవితాన్ని గడుపుతున్న ఓ దళిత కుటుంబం అన్ని అర్హతలు ఉన్నా ఎలాంటి ప్రభుత్వ పతకాలు అందలేదని వాపోతున్నారు.వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో మందుల వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ దళిత దంపతులు ఇద్దరు పిల్లలతో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు.

 No Government Schemes For Dalit Family In Mothe Mandal,government Schemes ,dalit-TeluguStop.com

మోతె పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవాపురం రోడ్డు పక్కన సొంత స్థలంలో రేకుల షెడ్డులో కాలం వెళ్లదీస్తున్నారు.వెంకటేశ్వర్లు మెకానిక్ గా కుటుంబాన్ని భారంగా లాక్కొస్తున్నాడు.ఇక వర్షాలు వస్తే ఇంటిలోకి నీళ్ళుతో పాటు,పాములు తేళ్లు వచ్చి చేరడంతో నిద్రలేని రాత్రులు గడపడం పరిపాటిగా మారింది.ఈ నేపథ్యంలో వారు శనార్తి తెలంగాణతో మాట్లడుతూ ఇరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.

ఓటు హక్కు,ఆధార్,రేషన్ కార్డు ఇక్కడనే ఉన్నా,ఎలాంటి ఆస్తులు లేకున్నా,రెక్కల కష్టంతో బ్రతుకుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు.

డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు,అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పటికైనా కోదాడ ఎమ్మెల్యే మా పరిస్థితిని అర్దం చేసుకొని గృహలక్ష్మి పథకంలో ఇల్లు లేదా దళిత బంధు అయినా మంజూరు చేయించి ఆదుకోవాలని కోరారు.ఇంతటి పేదరికంలో మగ్గుతున్న వారిని కాదని, అధికార పార్టీలో ఉన్న అనర్హులకు పథకాలను కట్టబెట్టే స్థానిక గులాబీ నేతల తీరుపై స్థానిక ప్రజలు పెదవి విరుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube