భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కోరారు.ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

 In The Wake Of Heavy Rains, People And Authorities Should Be Alert, Minister Utt-TeluguStop.com

అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు,వంకలు,చెరువులు,వంతెనల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ప్రజలు లోతట్టు ప్రాంతం శిధిలమైన భవనాలలో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

శిధిలమైన పాఠశాలల పట్ల విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.విద్యుత్, మున్సిపల్,రెవెన్యూ, పోలీస్ అధికారులు నిరంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube