ఐటీ హబ్ నల్లగొండ ప్రజల చిరకాల కోరిక: ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ జిల్లా:నల్గొండ( Nalgonda )కు ఐటీ హబ్ అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరికని, సీఎం కేసీఆర్,ఐటీ మంత్రి కేటీఆర్,జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నల్గొండకు ఐటీ హబ్ మంజూరైందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి( Kancharla Bhupal Reddy) అన్నారు.గురువారంజిల్లా కేంద్రంలో ఐటి హబ్ నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లడుతూ ప్రస్తుతం ఐటీ హబ్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని,మరో మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామనితెలిపారు.

 It Hub Nalgonda People's Long Wish: Mla Kancharla-TeluguStop.com

నల్గొండ చరిత్రలో నిలిచేలా ఐటీ హబ్ నిర్మాణం చేస్తున్నామన్నారు.తమకు స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు వస్తాయని యువత సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

ఇప్పటికే 16 కంపెనీలు నల్గొండ ఐటీ హబ్ లో తమ బ్రాంచ్ లు నెలకొల్పుతామని ఒప్పందం చేసుకున్నాయని,మొత్తం 3 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజి భవనం కూడా పూర్తి కావొస్తున్నదని,మెడికల్ కాలేజీకి ప్రొఫెసర్లు,డీన్లు, డాక్టర్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.

నల్గొండలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత నల్గొండ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని,నల్గొండను నందన వనంగా అభివృద్ధి చేసున్నామన్నారు.నల్గొండలో అభివృద్ధి చేసిన రోడ్లను,జంక్షన్లను చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంబరపడుతున్నారని,నల్గొండ పట్టణం సుందరికరణ చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని,జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్ నల్గొండలో పర్యటిస్తారని,139 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ వాళ్లకు అభివృద్ధి కనబడటం లేదని, కోమటిరెడ్డికి మతిస్థిమితం లేదని,పూటకో మాట, రోజుకో పార్టీ మారే కోమటిరెడ్డి అన్నదమ్ములను ఎవ్వరు నమ్మరని,అభివృద్ధి నిరోధకులుగా మారారని విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ వాళ్లు అనవసర విషయాల్లో నన్ను లాగి, నాపై బురద జల్లుతున్నారని,సోషల్ మీడియా( Social media )లో కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలకు అన్నీ తెలుసునని,నాపై అభాండాలు వేసే వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

అభివృద్ధి వైపే ప్రజలు వుంటారని,కోమటిరెడ్డి లాంటి దగుల్భాజీని ఎవ్వరు నమ్మొద్దని,నల్గొండలో కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.

ఇప్పటివరకు 1300 కోట్ల రూపాయలతో నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినమని, దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.నల్గొండలో చేసిన అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించండని,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ సారి శంకర గిరి మాన్యాలేనని,డిపాజిట్లు కూడా రావన్నారు.

ప్రజలే అంతిమ నిర్ణేతలుగా ఉంటారని,నల్గొండ ప్రజలు గులాబీ పార్టీ వైపే వుంటారని,అభివృద్ధికి పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube