నల్లగొండ జిల్లా:జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు చెప్పిన కథనం ప్రకారం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన ముచ్చపోతుల సైదులు(49) తన భార్య ధనమ్మ(42)ను వ్యవసాయ పనులు చేస్తుండగా హత్య చేశాడు.తర్వాత తాను కూడా అక్కడే ఉన్న చెట్టుకు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనితో గ్రామంలో విషాదం నెలకొంది.విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్సై అనిల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, పోస్టుమార్టం కోసం మృతులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.