డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజా చైతన్యం కోసం చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర మార్చి 6న జనగాం జిల్లా ఖిలాషాపూర్ బహుజన ఉద్యమ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన గడ్డ నుండి ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఖమ్మం జిల్లా ఏన్కూరు చేరుకుంటున్న సందర్భంగా బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని బిఎస్పీ వైరా నియోజకవర్గ ఇంచార్జి నారపోగు ఉదయ్ మహారాజ్ ఆధ్వర్యంలో శనివారం ఏన్కూరులో గోడ పత్రికను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఉదయ్ మహరాజ్ మాట్లాడుతూ.75 ఏండ్లుగా అణగారిన వర్గాల బ్రతుకుల్లో మార్పులేదని, ఆధిపత్య పార్టీలన్నీ అణగారిన వర్గాలను మోసంచేసి రాష్ట్రంలో, దేశంలో ప్రజల సంపదను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు.ఆర్ఎస్పీని ముఖ్యమంత్రి చేస్తేనే పేద ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు.
ఆర్ఎస్పీ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యంగల నరేష్, వైరా నాయకులు ఇస్నపల్లి నాగరాజు, నరాల రాకేష్, ఎక్కిరాల సామేలు, పూర్ణకంటి రత్తయ్య, యంగల ప్రభాకర్, వెంకటి, రాధమ్మ, పుష్ప, రుక్మిణి, పండు తదితరులు పాల్గొన్నారు.