ఎస్సారెస్పీ కాల్వను అక్రమించిన మాజీ ఎంపీటీసీ:బాధిత రైతులు

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వ హాయంలో అధికార పార్టీ అండ చూసుకుని ఎస్సారెస్పీ 22ఎల్ కాల్వను పూర్తిగా ఆక్రమించి, రైతులకు దారి లేకుండా,సాగు నీరు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న మాజీ ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా మోతె మండలం రాంపురంతండా గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతులు కోరుతున్నారు.తన భూమిలో నుండి తీసిన ఎస్సారెస్పీ 22ఎల్ కెనాల్ మాజీ ఎంపీటీసీ ఆనాటి అధికార బలంతో సొంత జేసీబీ ఉండడంతో ఇష్టమొచ్చినట్లుగా కాల్వను ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఆరోపించారు.

 Farmers Affected By Former Mptc Who Violated The Ssrsp Canal , Ssrsp Canal , Mp-TeluguStop.com

ఇప్పటికైనా ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని, ఎస్సారెస్పీ కాలువను సంబంధిత మ్యాప్ ద్వారా గుర్తించి పునరుద్ధరణ చేయాలని బాధిత రైతు అంగోత్ రంగా,ఇతర రైతులు వేడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube