మొదటి తారీకునే పెన్షన్ చెల్లించాలి:రిటైర్డ్ ఉద్యోగుల సంఘం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ప్రతి నెల మొదటి తేదీనే పెన్షన్ అందజేయాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య(R.Sitaramaiah ) అన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపిన అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ కు వినతిపత్రం అందజేశారు.

 Pension To Be Paid On First Date: Retired Employees Union, Pension , Suryapet D-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రెండు డిఆర్ లను మంజూరు చేయాలని, కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించాలని,రెండవ పి.ఆర్.సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సమాజంలో రిటైర్ ఉద్యోగులు( Retired Employees ) అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెన్షనర్లకు సరైన సమయంలో పెన్షన్ రాకపోవడంతో కనీసం మెడిసిన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి( Ravinder Reddy ), జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు,జిల్లా కోశాధికారి ఎస్.కె.హమీద్ ఖాన్,మండల అధ్యక్ష కార్యదర్శులు దండా శ్యాంసుందర్ రెడ్డి, సుధగాని నాగేశ్వరరావు, నాయకులు సురేందర్ రెడ్డి,వెంకటేశ్వర్లు,కృపాకర్ రెడ్డి,గట్ల సోమయ్య, సదాశివరావు,రామిరెడ్డి, వీరభద్రయ్య,వీరయ్య, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube