నిబంధనలు ఉన్నా కట్టలు తెగిన కరెన్సీ...!

నల్లగొండ జిల్లా:2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థంకాకపోయినా నల్లగొండ జిల్లా సాగర్ నియోజకవర్గ పరిధిలోని 6 ఆరు మండలాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పంచడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వినికిడి.ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేసే అవకాశం ఉందని,ఇప్పటికే పోలీసుల కంటపడకుండా కీలక నేతల ఇళ్ళకు డబ్బు సంచులు చేరినట్లు,ఈనెల 30 న పోలింగ్ ఉండడంతో 28,29 తేదీల్లో డబ్బులతో పాటు మందు పంచే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతుంది.ఒకవేళ ఎక్కడన్నా పోలీసులకు దొరికినా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వైపు నుంచి ఓటర్లకు డబ్బు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్లు, అవసరమైతే రెండో విడత పంపిణీకి కూడా ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది.జనరల్ ఎలక్షన్స్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా ఓటుకు నోటు పంపిణీ చేస్తూ పోతే, భవిష్యత్ లో సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా చేసే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

 Despite The Regulations, The Currency Is Broken...!-TeluguStop.com

రాజకీయాలు పెద్దమొత్తంలో కమర్షియల్ గా మారుతున్నా ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేని స్థితికి నెట్టివేయబడిందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని,ఈ పరిస్థితిని ప్రక్షాళన చేయకపోతే రాబోయే కాలంలో ఎన్నికలు మరింత ఖరీదైనవిగా మారి,దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube