దేశ రాజధాని ఢిల్లీ( Delhi ) నగరంలో ఓ మహిళ తన స్నేహితురాళ్లతో కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్ళింది.అక్కడ తాను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ దోశను ఆర్డర్ చేసింది.
ఆ దోశను రెస్టారెంట్ వారు తనకు ఇచ్చిన తర్వాత ఓ రెండు ముక్కలు తినింది.అయితే ఆ సమయంలో ఆమెకు కాస్త ఏదో తేడా అనిపించడంతో ఆ దోశను క్షుణ్ణంగా పరిశీలించింది.
ఆ దోశను చూసిన ఆవిడ నిజంగా వామిటింగ్ చేసుకునేలా పరిస్థితి ఏర్పడింది.అసలు విషయం ఏమిటంటే.
ఆమె తీసుకున్న దోశలు( Dosalu ) ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి.ఈ దెబ్బకి ఆవిడ ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.దోశ తీసుకున్న తర్వాత ఆవిడ బొద్దింకలను గమనించాక ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై గొడవకు దిగింది.అంతటితో ఆగకుండా ఆ రెస్టారెంట్ పై పోలీస్ లకు కంప్లైంట్ చేసింది.వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్ దగ్గరికి చేరుకొని రెస్టారెంట్ సంబంధించిన పర్మిషన్ ను చూపించమనగా యాజమాన్యం తమకి ఎటువంటి అనుమతులు లేవని చెప్పగా.
అసలు ఇంత రద్ది ప్రాంతంలో ఇంత రెస్టారెంట్ కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఆమె షాక్ గురైంది.
ఏది ఏమైనా ఆ హోటల్ పై సదరు అధికారులు యాక్షన్ తీసుకునేంతవరకు తాను ఈ విషయాన్ని వదలనని చెప్పుకొచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆమెపై పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.
ఆ రెస్టారెంట్ కిచెన్ కు పై భాగం కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే.