క్రికెట్.భారతదేశంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా.
చిన్న, పెద్ద, కులం, మతం అని తేడా లేకుండా అందరూ ఆస్వాదించే విషయం.ఇక నాలుగు రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 17 కొరకు నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లను ప్రేక్షకులు కొనుగోలు చేయవచ్చు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత క్రికెట్ అభిమానులు మార్చి 22 నుండి ఐపీఎల్ 17వ సీజన్ ( IPL season 17 )మొదలుకానుంది.చెన్నై లో ఉన్న చెపాక్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది.

మార్చి 22 రాత్రి 7:30 గంటలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్( Royal Challengers Bangalore, Chennai Super Kings ) జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్ కు సంబంధించి ఆన్లైన్ లో మార్చి 18 ఉదయం 9:30 గంటల నుండి టికెట్లను కొనుగోలు చేయవచ్చు.అయితే ఒక్కో వ్యక్తికి కేవలం రెండు టికెట్లు మాత్రమే అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు.ఈ టికెట్లను ఆన్లైన్ లో పేటీఎం లేదా చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్ విశ్వనాథన్( K Viswanathan ) తెలిపారు.

ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల ధర చూస్తే..స్టేడియంలో ఉన్న C, D, E lower టికెట్ ధర రూ.1700 కాగా., ఐ, జె, కె అప్పర్ రూ.4000 ఉండగా., i, J, K lower రూ.4500 గా నిర్ణయించారు.వీటితో పాటు కేఎంకే టెర్రస్ టికెట్ ధర రూ.7500 గా నిర్ణయించారు.అలాగే C, D, E Upper రూ.4000 గా టికెట్ ధరను నిర్ణయించారు.కాబట్టి ఎవరైనా మ్యాచ్ కి వెళ్లి చూడాలని అనుకుంటారో వారు సదరు వెబ్సైట్స్ కి వెళ్లి కావాల్సినన్ని టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.







