నల్లగొండ జిల్లా:కేసీఆర్ నల్గొండ నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని,టీఆర్ఎస్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ పాలన గురించి గొప్పలు చెప్పడానికి,బీజేపీని విమర్శించడానికి కొంచమైనా సిగ్గుండాలని బీజేపీ నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.శనివారం తాను చేపట్టిన ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ రెండవ రోజు తిప్పర్తి మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన ప్రజల నుద్దేశించి మాట్లడుతూ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బీజేపీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండని,తన కొడుక్కి టిక్కెట్ కోసం కేసీఆర్ దగ్గర మెప్పు పొందడానికి బీజేపీపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేత వెంకయ్య నాయుడు పార్టీకి రాజీనామా చేసి ఉప రాష్ట్రపతిగా వున్నాడని,నీలాగా నీచ రాజకీయాలు చేయలేదని గుర్తు చేశారు.గుత్తాకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
గెలిచే సత్తా లేక మూడు పార్టీలు మారిన చరిత్ర ఆయనదని దెప్పిపొడిచారు.ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ నల్గొండకు చేసిందేమీ లేదన్నారు.
కేసీఆర్ కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిండు.కానీ,నల్గొండ నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు.
ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోయాయని విమర్శించారు.తిప్పర్తిలో ఉన్నవన్నీ మందు షాపులు,బెల్ట్ షాపులేనని,మెడికల్ షాపులు మాత్రం లేవని అన్నారు.
మహిళలు కూలీనాలీ చేసి కష్టపడిన సంపాదించుకున్న డబ్బులు భర్తల మద్యానికే వెళ్లిపోతున్నాయని,గ్రామాల్లో బెల్ట్ షాపుల వలన కుటుంబాలు కుంటుపడుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.అనంతరం తిప్పర్తిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి పరిశీలించారు.